Wednesday, January 22, 2025

పంత్ అది నీ క్యాచే: రోహిత్

- Advertisement -
- Advertisement -

బ్రిడ్జ్‌టౌన్: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా సూపర్‌లో ఆఫ్ఘానిస్తాన్‌పై టీమిండియా విజయం సాధించింది. సూర్యకుమార్ హాఫ్ చేయడంతో పాటు బుమ్రా, అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో రాణించడంతో భారత జట్టు 47 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆఫ్ఘానిస్తాన్ బ్యాటింగ్ చేస్తుండగా కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ల మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కుల్‌దీప్ వేసి 11 ఓవరలలో గుల్బాదిన్ నైబ్ భారీ షాట్ ఆడాడు. బంతి పైకి లేవడంతో పంత్ పరుగు తీస్తూ క్యాచ్ అం దుకున్నాడు. బంతి సమీపంలో ఉన్న రోహిత్ రావద్దని పంత్ అరిచాడు. అదే సమయంలో ‘అది నీ క్యాచే అని’ రోహిత్ అన్నాడు. దీనికి సంబంధించిన మాటలు మైక్స్‌లో వినిపించాయి. పంత్ బంతి అందుకున్న తరువాత రోహిత్ వైపు సరదాగా విసిరాడు. ఈ వీడియోను ఐసిసి తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News