హైదరాబాద్: ఇప్పట్లో రిటైర్ మెంట్ కానని, ఇంకా రెండు మూడేళ్లు ఆడాల్సి ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. రోహిత్ మీడియాతో మాట్లాడారు. 2025 వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ తో పాటు 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని ఉందని పేర్కొన్నాడు. వన్డే ప్రపంచ కప్ గెలవాలని ఉందని, అసలైన కప్ అంటే వన్డే ప్రపంచ కప్ అని చెప్పారు. ప్రస్తుతం తన ఆటతీరు బాగుందని, ఇలానే ఆడుతూ మరికొన్నాళ్లపాటు క్రికెట్ లో కొనసాగాలనుకుంటున్నానని వివరణ ఇచ్చాడు. 2023 వరల్డ్ కప్ లో ఫైనల్ వరకు భాగానే ఆడామని, చివరలో బొల్తా పడ్డామని, ఫైనల్ లో తమ ఆట తీరు బాగోలేదని చెప్పలేమని, ఆస్ట్రేలియా తమకన్నా మెరుగ్గా ఆడిందని తెలిపారు. అందరికీ చెడు రోజు అంటూ ఒకటి ఉంటుందని, ఆ రోజు మాకు వచ్చిందని రోహిత్ తెలిపాడు. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ ను రోహిత్ సారథ్యంలో టీమిండియా 4-1 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే.
వన్డే వరల్డ్ కప్ గెలవాలని ఉంది: రోహిత్
- Advertisement -
- Advertisement -
- Advertisement -