Sunday, December 1, 2024

ఓపెనింగ్ వదులుకున్న రోహిత్..!

- Advertisement -
- Advertisement -

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు భారత్, ఆసీప్ పై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన కెఎల్ రాహుల్-యశస్వీ జైస్వాల్ అదరగొట్టారు. అయితే, తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్.. రెండో టెస్టు కోసం తిరిగి జట్టుతో కలిశాడు. ఈ నేపథ్యంలో రోహిత్.. జైస్వాల్ తో కలిసి ఓపెనింగ్ చేస్తాడా? లేదా రాహుల్ నే కంటిన్యూ చేస్తారా? అనే దానిపై చర్చ జరుగుతోంది.

మరోవైపు రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా పీఎం లెవెన్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయడం లేదని ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు కారణం.. టీం షీట్‌లో రోహిత్ పేరు ఐదో స్థానంలో ఉండటమే. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, జైస్వాల్ పేర్లు ఉన్నాయి. రోహిత్ ఈ ఒక్క మ్యాచుకే ఓపెనింగ్ బెర్త్ వదులుకుంటారా? లేదా సిరీస్ మొత్తమా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, తొలి టెస్టులో రాణించిన రాహుల్-యశస్వీనే ఓపెనర్లుగా పంపాలని క్రికెట్ అభిమానులు, పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయం తెలియజేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News