హైదరాబాద్: వరల్డ్ కప్‌లో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి టీమిండియా తొలి స్థానంలో ఉంది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 160 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టలోని తొమ్మిది మంది ఆగాళ్లు బౌలింగ్ చేశారు. శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ తప్ప అందరూ బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు బౌలింగ్ చేసి చెరో వికెట్ తీశారు. వన్డేలలో కోహ్లీకి ఇది ఐదో వికెట్‌కాగా రోహిత్ తొమ్మిది వికెట్లు తీశారు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 25 ఓవర్‌లో బౌలింగ్ చేసి కెప్టెన్ స్కాట్ ఎడ్వర్ట్ ఔట్ చేశాడు. 3572 రోజుల తరువాత విరాట్ వికెట్ తీశాడు. రోహిత్ శర్మ 48వ ఓవర్లలో బౌలింగ్ చేసి ఆఖరి వికెట్ తీశాడు. డచ్ ఆల్‌రౌండర్ తేజ నిడమానూరు అర్థ సెంచరీ చేసి ఔటయ్యాడు. 3980 రోజుల తరువాత రోహిత్ శర్మ వికెట్ తీసుకున్నాడు. చివరి సారిగా 2012లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ వికెట్ తీసుకున్నాడు. 20 ఏళ్ల తరువాత ప్రపంచ కప్‌లో వికెట్ తీసిన తొలి ఇండియన్ కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు.
Moment of Virat taking wicket and both Virat and Anushka celebrating together 💖👑#Virushka #ViratKohli𓃵 #GOAT𓃵 #CricketWorldCup2023 #CWC23 #CWC #INDvsNED #INDvNED #NEDvsIND #wicket #ChinnaswamyStadium #anushkasharma pic.twitter.com/wwAODrGn74
— Naeem Khatri (@TheNaeemKhatri) November 13, 2023
The Moment Captain Rohit Sharma bowling and picked wicket at Chinnaswamy.
– Captain, Leader, Legend, Hitman. pic.twitter.com/FIkRGPmH7S
— CricketMAN2 (@ImTanujSingh) November 12, 2023