చెన్నై: పంజాబ్ కింగ్స్-ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తమ బ్యాటింగ్ తీరు బాగాలేదని రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశారు. పంజాబ్ కు తక్కువ టార్గెట్ ఇచ్చామని, పరుగులను కాపాడుకోవడం కష్టమన్నారు. తమ బ్యాటింగ్‌లో పొరపాటు జరిగిందని, విఫలమయ్యామన్నారు. ఫిచ్ బ్యాటింగ్ అనుకూలిస్తుందని, బ్యాడ్ వికెటేమీ కాదన్నారు. పంజాబ్ ఈజీగా బ్యాటింగ్ చేసిందని కొనియాడారు. తాము 150 నుంచి 160 పరుగులు చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయన్నారు. పవర్ ప్లేలో ముంబయి ఇండియన్స్ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారని ప్రశంసించారు. చాలెంజ్ పిచ్‌ల్లో ప్రణాళిక ప్రకారం బ్యాటింగ్ చేస్తే పరుగులు వస్తాయన్నారు. పంజాబ్ 132 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి చేధించింది. కెప్టెన్ రాహుల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. గేల్ 35 బంతుల్లో 43 పరుగులు చేసి బాధ్యయుతంగా ఆడారు. దీంతో తొమ్మిది వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌పై పంజాబ్ ఘన విజయం సాధించింది.