Monday, December 23, 2024

రికార్డుల మోత మోగించిన రోహిత్ శర్మ

- Advertisement -
- Advertisement -

సెయింట్ విన్సెంట్: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో భారత్ సెమీస్‌లోకి దూసుకెళ్లింది. రోహిత్ 41 బంతుల్లో 92 పరుగులు చేసి సునామీ సృష్టించాడు. పట్టపగలే ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డులు సృష్టించాడు. అంతర్జాతీయ టి20ల్లో 4165 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్ రోహిత్ కావడం గమనార్హం. టి20ల్లో 200 సిక్స్‌లు బాదడంతో పాటు కెప్టెన్‌గా ఈ మ్యాచ్‌లో ఎనిమిది సిక్స్‌లు బాదిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. టి20 వరల్డ్ కప్‌లో 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు కెప్టెన్ గా రికార్డుల్లో కెక్కాడు. ఆస్ట్రేలియాపై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్, కెప్టెన్‌గా రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ హాఫ్ సెంచరీ చేసినప్పుడు టీమిండియా అత్యల్ప పరుగులు (52) చేసిన జట్టుగా రికార్డుల్లో ఉంది. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ 19 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం రోహిత్ ఏడు రికార్డులు సృష్టించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News