Thursday, January 2, 2025

రోహిత్ శర్మ ఇంట్లో విషాదం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. కోహ్లీ సెంచర్లీ, రోహిత్, శుభమన్ గిల్ హాఫ్ సెంచరీలు చేయడంతో గెలుపొందారు. రోహిత్ శర్మ 67 బంతుల్లో 83 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ చేయగా భావోద్వేగంతో ఆకాశం వైపు చూస్తూ మ్యాజిక్ మ్యాజిక్ అన్నాడు. రోహిత్ పెంపుడు శునకం పేరు మ్యాజిక్. హాఫ్ సెంచరీని రోహిత్ మ్యాజిక్‌కు అంకితం చేశాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పెంపుడు శునకం మ్యాజిక్ కన్నుమూసిందని రోహిత్ సతీమణి రితిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఇంట్లో తన బిడ్డను కోల్పోయిన బాధ ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె పోస్టుపై సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, అతియా శెట్టి, తిలక్ వర్మ స్పందించారు. మన ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులు కుటుంబ సభ్యులుగా కలిసిపోతాయి. పెంపుడు జంతువులు చనిపోయినప్పుడు బాధగా ఉంటుంది. కుక్క, పిల్లి జీవిత కాలం తక్కువ కావడంతో మనం నుంచి త్వరగా దూరం అవుతాయి.

Rohith sharma dog passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News