Wednesday, January 22, 2025

రోహిత్ ధనాధన్ దంచేయడానికి అతడే మూలకారణం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ తొలి ఓవర్ నుంచి దూకుడుగా ఆడుతున్నాడు. తొలి పది ఓవర్లలో దాదాపుగా 70 పరుగులు పైగా సాధిస్తున్నారు. ఓపెనర్లు రోహిత్, శుభ్‌మన్ గిల్ మంచి భాగస్వామ్యం నిర్మించడంతో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా మ్యాచ్ నిర్మిస్తున్నారు. బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ టీమిండియాకు వెన్నెముకగా నిలిస్తున్నాడు. చివరలో కెఎల్ రాహుల్ మెరుపులు మెరిపిస్తున్నాడు. దీనికి తోడు షమీ బౌలింగ్ దాటికి ప్రత్యర్థి బ్యాట్స్ మెన్లు బెంబేలెత్తుతున్నారు. కోహ్లీ వెనుక ఉన్నాడనే ఉద్దేశంతోనే రోహిత్ శర్మ ధనాధన్ బ్యాటింగ్‌తో విరుచుకపడుతున్నాడని అశిష్ నెహ్రా తెలిపాడు. భయం, ఒత్తిడి లేకుండా రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయడానికి కారణం కోహ్లీ అని పేర్కొన్నారు. ఇద్దరు కలిసి టీమ్‌కు బొమ్మ బొరుసు లాగా ఉన్నారని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News