Monday, December 23, 2024

స్టార్ స్పోర్ట్స్ పై రోహిత్ శర్మ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడు సంవత్సరాల తరువాత సెంచరీ చేశాడు. ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ స్టార్ స్పోర్ట్‌పై రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మూడు సంవత్సరాల తరువాత సెంచరీ చేశాడు, పదే పదే లైవ్‌లో పెట్టడంతో రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. గత మూడు సంవత్సరాల నుంచి తాను 12 వన్డేలు మాత్రమేనని ఆడానని వివరించాడు. 2020లో ఆసీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ బాదాడు. రోహిత్ సైతం శతకానికి దగ్గరగా వచ్చి చాలా సార్లు ఔటయ్యాడు. చాలా రోజుల తరువాత రోహిత్ సెంచరీ చేయడంతో అతడి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. జట్టు కోసం వేగంగా స్కోర్ చేయాలనే ఉద్దేశంతో చాలా సార్లు ఔటయ్యానని వివరణ ఇచ్చాడు. టి20లు రోహిత్ ఎక్కువగా ఆడడంతో వన్డేలు ఆడలేదు. న్యూజిలాండ్ మూడో వన్డేలో రోహిత్ సెంచరీ చేయడంతో భారత జట్టు 90 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్‌ను భారత జట్టు వైట్‌వాష్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News