Tuesday, November 5, 2024

రోహిత్ వరల్డ్ రికార్డు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా వంద టి20ల్లో విజయం సాధించిన తొలి పురుష క్రికెటర్‌గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ఆప్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ శర్మ 149 మ్యాచ్‌లు ఆడి వంద మ్యాచ్‌లో విజయం సాధించిన క్రికెటర్‌గా ఉన్నాడు. ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 111 మ్యాచ్‌లో విజయం సాధించి ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డ్యాన్ వ్యాట్ రికార్డు సృష్టించారు. పురుషుల్లో మాత్రం రోహిత్ తరువాత పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ మాలిక 124 మ్యాచ్‌ల్లో 86 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా తరపున రోహిత్ తరువాత విరాట్ కోహ్లీ 115 మ్యాచ్‌ల్లో 73 విజయాల్లో భాగం పంచుకున్నాడు. రోహిత్ కెప్టెన్సీలో 52 మ్యాచ్‌ల్లో 40 విజయాలను టీమిండియా సాధించడంతో కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. ఆప్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. శివమ్ దూబే దూకుడుగా 60 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీయడంతో అతడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News