తిరుపతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా సెల్ ఫోన్ మిస్సయింది. ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి తిరుపతిలో నేడు విస్తృతంగా పర్యటించారు. అయితే ఆమె ఎస్వీ యూనివర్శిటీలో ‘స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) సమీక్షా సమావేశంకు హాజరయ్యారు. ఎస్వీ యూనివర్శిటీ కార్యక్రమంలో ఉండగానే తన ఫోన్ చోరీకి గురైనట్లు ఆమె గుర్తించారు. ఫోన్ కోసం వెతికే ప్రయత్నం చేసినప్పటికీ ఫోన్ కనపడలేదు. అయితే ఫోన్ పద్మావతి గెస్ట్ హౌస్‌లో చోరికి గురయిందా లేక ఎస్వీ యూనివర్శిటీలో చోరీకి గురయిందా? అన్న మీమాంస కూడా ఆమె వ్యక్తం చేశారు. కాగా మూడు పోలీస్ బృందాలు ఆ సెల్ ఫోన్ కనుగొనే పనిని చేపట్టాయి. గాలింపు ముమ్మరం చేశారు. సిగ్నల్ ఆధారంగా ఫోన్‌ను ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు. దాదాపు రెండు గంటలపాటు రోజా సెల్‌ఫోన్ కోసం గాలింపులు జరిపారు. కాగా ఎస్పీ రూయా హాస్పిటల్ సమీపంలో సెల్‌ఫోన్ సిగ్నల్ లభించింది. చివరికి సిగ్నల్‌ను ట్రేస్ చేసిన పోలీసులు దొంగను పట్టుకుని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్ చోరికి గురయ్యాక రోజా కాస్త మనస్థాపానికి గురయ్యారు. తక్కువ సమయంలోనే నిందితుడిని పట్టుకున్నారు. అతడు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గానే పట్టుకున్నారని సమాచారం.
చోరికి గురైన రోజా ఫోన్ లభ్యం!
- Advertisement -
- Advertisement -
- Advertisement -