Wednesday, January 22, 2025

అధికారంలో ఉన్నప్పుడు బాబుకు నందమూరి కుటుంబం గుర్తుకు రాదు: రోజా

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి నేత లోకేష్ పాదయాత్రను చూసి యువత పారిపోతుందని మంత్రి రోజా చురకలంటించారు. లోకేష్ యాత్రలో కనీసం పది మంది కూడా లేరన్నారు. టిడిపిని లాక్కున్న దొంగలు చంద్రబాబు, లోకేష్ అని మండిపడ్డారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు నందమూరి కుటుంబం గుర్తుకు రాదని, కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబుకు నందమూరి కుటుంబం కావాలన్నారు. చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వల్ల ఉపయోగం లేదని రోజా విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్‌టిఆర్‌ను పిలుస్తున్నారని  ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News