Sunday, April 6, 2025

వైశ్రాయ్ వెన్నుపోటు రాజకీయం ఇంకా నడిపిస్తున్నారు: రోజా

- Advertisement -
- Advertisement -

అమరావతి: సిఎం జగన్‌ను ఎవరు వ్యతిరేకించినా వారికే నష్టం ఉంటుందని మంత్రి రోజా తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి తన సొంత చరిష్మాతో ఎంఎల్‌ఎలను గెలిపించుకున్నారని, టిడిపి అధినేత, ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 23 మంది ఎంఎల్‌ఎలను లాక్కున్నప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసునని చురకలంటించారు. వైశ్రాయ్ హోటల్‌లో మొదలుపెట్టిన వెన్నుపోటు రాజకీయాన్ని ఇంకా నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయం అంటే అసహ్యించుకునే పరిస్థితికి టిడిపి దిగజారిందని రోజా విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News