Sunday, January 19, 2025

చంద్రబాబు అంటేనే మోసం: రోజా

- Advertisement -
- Advertisement -

అమరావతి: అమ్మ ఒడిపై ఇష్టానుసారం మాట్లాడి ఇప్పుడు అమ్మకు వందనం అంటున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో హామీలన్నీ నెరవేర్చారని ప్రశంసించారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఎంగా ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబులా మోసం చేసే వ్యక్తి దేశంలో ఎక్కడా లేడన్నారు.

Also Read: మోడీ ఖ్యాతిని జీర్ణించుకోలేని రాహుల్: బిజెపి

చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు పథకాలు ఎందుకు అమలు చేయలేదని అడిగారు. వాలంటీర్ వ్యవస్థతో లబ్దిదారుల ఇంటికే సంక్షేమ పథకాలు అందుతున్నాయని మెచ్చుకున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. చంద్రబాబు యువతను ఆదుకుంటాననడం పెద్ద జోక్‌గా మారందని రోజా దుయ్యబట్టారు. చంద్రబాబు వస్తే జాబ్ అంటూ గతంలో మోసం చేశావని, రైతు భరోసా కేంద్రాలతో అన్నదాతలకు సిఎం జగన్ అండగా నిలిచారని మంత్రి కొనియాడారు. రైతులను చంద్రబాబు ఎలా మోసం చేశారో అందరికి తెలుసునన్నారు. 3300 చికిత్సలకు ఆరోగ్య శ్రీ అందిస్తున్న ఏకైక సిఎం జగన్ అని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News