Saturday, December 21, 2024

మహిళలపై దాడులు.. హోంమంత్రి వెటకారంగా మాట్లాడటం సరికాదు: రోజా

- Advertisement -
- Advertisement -

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీస్ వ్యవస్థను కక్షసాధింపు చర్యలకు వాడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సిపి నేతల రోజా మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయం నుంచి రోజా మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని, బాధితు కుటుంబాలకు ప్రభుత్వం కనీసం భరోసా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అసమర్థత వల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయని, దాడులు జరుగుతుంటే హోం మంత్రి వెటకారంగా మాట్లాడటం సరికాదని రోజా హితువు పలికారు.

రెడ్‌బుక్ రాజ్యాంగంతో కూటమి నేతలు భయపెడుతున్నారని వైఎస్‌ఆర్‌సిపి నేత టిజెఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఎక్కువ కేసులు నమోదు చేయాలని పోలీసులపై కూటమి నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయం నుంచి సుధాకర్‌బాబు మాట్లాడారు. ప్రజలకిచ్చిన హామీలను కూటమి గంగలో కలిపిందని చురకలంటించారు. శాంతిభద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిజెఆర్ సుధాకర్ బాబు విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో అరాచకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు అదుపు చేయడంలేదని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News