అమరావతి: పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని కూటమి సర్కార్ పై మాజీ మంత్రి ఆర్ కె రోజా మండిపడ్డారు. ఇంతవరకు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడారు. కూటమి పాలనలో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 8 నెలలైనా ఒక్కపైసా చెల్లించలేదని అడిగారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థుల కష్టాలు వర్ణణాతీతం అని బాధను వ్యక్తం చేశారు. సంపద సృష్టించాక సూపర్ సిక్స్ అమలు చేస్తామని.. చావుకబురు చల్లగా చెబుతున్నారని నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పైన విమర్శలు గుప్పించారు. బటన్ నొక్కడం పెద్ద విషయమా?, ఇప్పడు ఎందుకు బటన్ నొక్కడం లేదని ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్ మెంట్ సహా అన్ని పథకాలూ ఆపేశారని, ఆరోగ్యశ్రీ కూడా నిలిపేశారని, వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేశారని దుయ్యబట్టారు. ‘పథకాలు అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకోవాలని గతంలో లోకేష్ అన్నారు, ఇప్పుడు ఎవరి కాలర్ పట్టుకోవాలి?’ అని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు హామీలకు పవన్ కళ్యాణ్ గ్యారంటీ ఇచ్చారని, ఇప్పుడు పవన్ ఏమయ్యారని, ఎందుకు నిలదీయడం లేదని మాజీ మంత్రి ఆర్ కె రోజా చురకలంటించారు.
లోకేష్… ఇప్పుడు ఎవరి కాలర్ పట్టుకోవాలి: రోజా
- Advertisement -
- Advertisement -
- Advertisement -