- Advertisement -
అమరావతి: సిఎం జగన్ మోహన్ రెడ్డి 99 శాతం హామీలను నెరవేర్చారని మంత్రి రోజా తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను సిఎం జగన్ అమలు చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాలతో ఎపి ప్రజలకు జగన్ అండగా ఉన్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికీ జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కొనియాడారు. చంద్రబాబు తన పాలనతో అమలు చేసిన ఒక్క పథకం పేరైనా చెప్పగలరా? అని అడిగారు. చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ యాత్ర చేస్తున్నారని రోజా దుయ్యబట్టారు. వారాహి పేరుతో చేస్తున్న నారాహి యాత్రను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. పార్టీ పెట్టి ఇన్నేళ్లైనా 175 స్థానాల్లో పోటీ చేయలేని ఏకైక వ్యక్తి పవన్ అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -