Saturday, April 19, 2025

సనాతన ధర్మం అంటే ఇదేనా పవన్: మాజీ మంత్రి రోజా

- Advertisement -
- Advertisement -

తిరుపతి: టిడిపి నేతల సవాల్‌కు వైసిపి నేత, టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సిద్ధమయ్యారని మాజీ మంత్రి రోజా తెలిపారు. గోవుల మృతిపై వివరించేందుకు భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి గోశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడారు. గోశాల వద్దకు వైసిపి నేతలను అనుమతించే దైర్యం టిడిపికి ఉందా? అని ప్రశ్నించారు. సవాల్ చేసిన వాళ్లే అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం అని చురకలంటించారు. కూటమి ప్రభుత్వంలో తిరుమల ప్రతిష్ట రోజు రోజుకు దెబ్బతింటోందని దుయ్యబట్టారు. సనాతన ధర్మం అంటే ఇదేనా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అని రోజా నిలదీశారు. గోవుల మృతిపై కమిటీ వేసి… తప్పు చేసిన వాళ్లను శిక్షించాలని డిమాండ్ చేశారు.

పోలీసులను టిడిపి కార్యకర్తలాగా వాడుకొని తప్పుడు కేసులు పెడుతాం, జైల్లో పెడుతాం అంటే ఊరుకోమని హెచ్చరించారు. వైకుంఠ ఏకాదశి క్యూలైన్ లో తొక్కిసలాట జరగడంతో భక్తులు చనిపోయారని, ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకున్నారా? సిఎం చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలని కానీ ప్రశ్నించిన వారిని శిక్షిస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత రూల్స్ వ్యతిరేకంగా పని చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. టిటిడి గోశాలలో గోవుల మృతిపై భూమన కరుణాకర్ రెడ్డికి టిడిపి నేతలు ఛాలెంజ్ విసిరారు. ఛాలెంజ్ స్వీకరించి టిటిడి గోశాలకి వెళ్లేందుకు భూమన సిద్ధం కావడంతో పోలీసుఉ అడ్డుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News