Wednesday, January 22, 2025

కారు కొంటే తప్పా? : టిడిపి నేతలపై రోజా ఫైర్

- Advertisement -
- Advertisement -

 

Roja and car

తిరుపతి: ఇటీవల కొత్త కారు కొంటే టీడీపీ నేతలు ‘రుషికొండ గిఫ్ట్’ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఏపి మంత్రి రోజా మండిపడ్డారు. ఈ రోజుల్లో మామూలు యాంకర్లు, చిన్న నటులు సైతం కారు కొంటున్నారని అన్నారు. తన స్థాయిలో  కారు కొనడం తప్పన్నట్టుగా టిడిపి నేతలు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు కొనాలంటే లోన్ తీసుకుంటే సరిపోతుందని, తాను కారు కొనడం గొప్పేమీ కాదని తెలిపారు.   తన కొత్త కారు విషయంలో ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. టిడిపి నేతలకు ఏదీ దొరక్క ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తున్నారని  విమర్శించారు. ఏది అమ్మినా, ఏది కొన్నా ఎంతో పారదర్శకతతో ఉంటానని స్పష్టం చేశారు. చదువురాని వారికి కూడా తాను సమాధానం చెప్పాల్సిన అవసరంలేదని, తాను జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత పారితోషికం తీసుకున్నదీ బ్యాంకు ఖాతా లావాదేవీలు పరిశీలిస్తే అర్థమవుతుందని రోజా వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News