Sunday, December 22, 2024

రోజా.. డైమండ్ రాణి, ఆమెకు సీటు వస్తుందో రాదో డౌటే !

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి జగనే యాక్సిడెంటల్ సిఎం
కెటిఆర్ రాజకీయ పరంగా డిజాస్టర్
రేవంత్ రెడ్డి పోరాట యోధుడు, ఫైటర్
సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

మనతెలంగాణ/హైదరాబాద్:  ఎపి సిఎం జగన్, మంత్రి రోజాలపై సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా డైమండ్ రాణి అని ఆమెకు సీటు వస్తుందో రాదో డౌట్ అని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సిఎం కాదనీ, సిఎం జగనే యాక్సిడెంటల్ సిఎం ఆయన ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బండ్ల గణేశ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పోరాటం చేసిన యోధుడు, ఫైటర్ అన్నారు. భారతదేశంలో రేవంత్ రెడ్డిలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారన్నారు. పోరాడి, కష్టపడి తనను తాను ప్రూవ్ చేసుకుని ముఖ్యమంత్రి అయ్యారన్నారు. నాన్న చనిపోతేనే, నాన్న వారసత్వంతోనే సిఎం అయితే యాక్సిడెంటల్ సిఎం అంటారన్నారు. పులుసు వండిపెట్టింది కాబట్టి రోజా పులుసు పాప అని ఆయన అన్నారు. రేపోమాపో మాజీ అయ్యాక ఇక్కడికి వచ్చి జబర్దస్త్ ప్రొగ్రామ్ చేసుకోవాలని బండ్ల గణేశ్ వ్యాఖ్యానించారు. సిఎం రేవంత్ రెడ్డిని అనే స్థాయి రోజాకు లేదన్నారు.
తండ్రి పేరు చెప్పుకొని కెటిఆర్ లీడర్ అయ్యారు…
తండ్రి పేరు చెప్పుకొని కెటిఆర్ లీడర్ అయ్యారని బండ్ల గణేశ్ మండిపడ్డారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన డ్యామేజీని చూడటానికి మేడిగడ్డ టూరుకు వెళ్తున్నావా? అని కెటిఆర్‌ను బండ్ల గణేశ్ ప్రశ్నించారు. కెటిఆర్ రాజకీయ పరంగా డిజాస్టర్ అని, ఆయన చుట్టూ వైఫై లాగ ఈగో ఉంటుందన్నారు. రేవంత్ సిఎం కావడంతో కెటిఆర్ బాధపడుతున్నారని, కెటిఆర్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే బిఆర్‌ఎస్‌కు 3 సీట్లు కూడా రాకుండాపోయేవని ఆయన ఆరోపించారు. ఇల్లు కొనేందుకే కెటిఆర్ అమెరికా వెళ్లాడని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ లో కవిత, హరీశ్‌లు మాత్రమే సమర్థులన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News