Thursday, January 23, 2025

నగరిలో హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న రోజా

- Advertisement -
- Advertisement -

తిరుపతి: అసెంబ్లీ ఎన్నికల్లో నటి ఆర్.కె. రోజా నగరి నియోజకవర్గం నుంచి ఎంఎల్ఏగా హ్యాట్రిక్ కొట్టాలనుకుంటోంది. ఆమె తన ప్రత్యర్థి గాలి భాను ప్రకాశ్ తో పోటీపడుతోంది. గాలి భాను ప్రకాశ్ తమ కుటుంబ వారసత్వ రాజకీయాలను ఈ ప్రాంతంలో నిలుపుకోవాలనుకుంటున్నాడు. దీంతో ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉంది.

2014లో రోజా,  గాలి ముద్దు కృష్ణమ నాయుడు(టిడిపి) పై 858 ఓట్ల తేడాతో మాత్రమే గెలుపొందింది. కాగా 2019లో ఆయన కుమారుడు భాను ప్రకాశ్ ను 2708 ఓట్ల తేడాతో ఓడించింది. మరి ఈ సారి పోటాపోటీ ఎలా ఉండబోతుందో? అనేక మండలాల్లో తమ పార్టీ నాయకులే ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారని, పనిచేస్తున్నారని తెలుస్తోంది. అయినా తాను కృంగిపోనని, నగరి నియోజకవర్గంతో తనకు గట్టి అనుబంధం ఉందని, వైఎస్ఆర్సి ప్రభుత్వం పనితీరు కూడా తనకు కలిసిరాగలదని రోజా గట్టి నమ్మకంతో ఉంది. కొన్ని వర్గాల నయవంచన కారణంగా ఆమెకు ఈసారి ఎన్నికలు కష్టతరంగా మారే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. చూడాలి మరి రోజా ఏ మేరకు నెగ్గుకొస్తుందో!?

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News