Sunday, December 22, 2024

జగనన్న తీసుకొచ్చినవే విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయి: రోజా

- Advertisement -
- Advertisement -

విజయవాడ: నేడు మంత్రులు ఇంటింటికీ నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశేషం ఏమిటంటే ఈ కార్యక్రమానికి నాడు ముఖ్యమంత్రి జగన్ తెచ్చిన వాహనాలే ఉపయోగపడుతున్నాయి. దీనిపై వైసిపి నేత రోజా స్పందించారు.

జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు, జగనన్న తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, జగనన్న నియమించిన సచివాలయ ఉద్యోగులు,  జగనన్న నియమించిన వాలంటీర్ వ్యవస్థ,  జగనన్న కట్టించిన రిటైనింగ్ వాల్, జగనన్న హయాంలో కొనుగోలు చేసిన 108, 104 వాహనాలు,  జగనన్న తీసుకొచ్చిన క్లీన్ ఆంధ్రా వాహనాలు, జగనన్న తీసుకొచ్చిన వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు, ఈరోజు విజయవాడ ప్రజలను వరద కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నాయి అంటూ రోజా ట్వీట్ చేశారు.  అంతేకాక విజయవాడ రోడ్లపై బారులు తీరిన రేషన్ వాహనాల వీడియోలను కూడా రోజా పంచుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News