Wednesday, January 22, 2025

మహిళను ఒక మాట అనాలంటే భయపడే పరిస్థితి రావాలి: రోజా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిడిపి నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తానని మంత్రి రోజా తెలిపారు. ఆదివారం బండారుకు రీకౌంటర్ ఇచ్చారు. న్యాయపరంగా పోరాడతానని, బండారు లాంటి చీడపురుగులను ఏరిపారేయాలని పిలుపునిచ్చారు. మహిళను ఒక మాట అనాలంటే భయపడే పరిస్థితి రావాలన్నారు. మహిళలను కించపరిస్తే చరిత్రరహీనులుగా మిగిలిపోతారని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకెళ్లడంతో టిడిపి నేతలకు పిచ్చెక్కిందని, బాబు తప్పు చేయకుంటే ఎందుకు బయటకు రాలేకపోతున్నారని రోజా విమర్శించారు. టిడిపి ఫెయిల్యూర్‌ను డైవర్ట్ చేయడానికే తనని టార్గెట్ చేశారని, టిడిపి, జనసేనకు దిగజారుడు రాజకీయలు మాత్రమే తెలుసునని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read: పివి ఎక్స్ ప్రెస్ వేపై కారు బీభత్సం…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News