అమరావతి: జిఎస్‌టి అధికారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన మాట నిజం కాదా? అని మంత్రి రోజా విమర్శించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడంతో మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. స్కిల్ స్కామ్‌లో ఇడి విచారణ జరిపిందని నిజమా కాదా? అని మండిపడ్డారు. ఐటి శాఖ కూడా చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది నిజమా కాదా? అని ప్రశ్నించారు. పక్కా ఆధారాలతో దొరికితే కొందరు గగ్గోలు పెడుతున్నారని, చంద్రబాబు నాయుడు లాయర్లు కుంటిసాకులపైనే వాదించారని, వ్యవస్థలను మేనేజ్ చేసుకొని ఇన్నాళ్లూ బాబు తప్పించుకున్నారని, దత్తపుత్రుడు చంద్రబాబు అవినీతిపై ఎందుకు మాట్లాడరని రోజా దుయ్యబట్టారు. టిడిపి నేతలు, పవన్ కల్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. తప్పు చేసి ఇంకా బుకాయిస్తున్నారని, టిడిపి బంద్‌ను ప్రజలు పట్టించుకోలేదని, సాక్ష్యాధారాలతో దొరికిపోయి బంద్‌కు పిలుపునిస్తారా? అని మంత్రి రోజా నిలదీశారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి పేరు చెబితే ఎన్నో పథకాలు గుర్తుకు వస్తాయని వివరించారు. చంద్రబాబు పేరు చెబితే అన్నీ స్కాములే గుర్తుకు వస్తున్నాయని చురకలంటించారు. చాలా స్కిల్డ్‌గా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ చేశామన్నారు.
చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు అడగడంలేదు: రోజా
- Advertisement -
- Advertisement -
- Advertisement -