Monday, January 20, 2025

పవన్ తల్లి, భార్యను తిట్టింది టిడిపి నేతలు కాదా?: రోజా

- Advertisement -
- Advertisement -

అమరావతి: వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని జనసేన అధినేత పవన్ కళ్యాన్ కు రిపోర్ట్ ఎవరిచ్చారని మంత్రి రోజా ప్రశ్నించారు. వాలంటీర్ల తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవన్ కు రోజా రీకౌంటర్ ఇచ్చారు. మహిళల మిస్సింగ్ కేసుల్లో టాప్-10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లేదని, తన తల్లిని తిట్టిన వాళ్లను గెలిపించమని పవన్ ప్రాదేయ పడడం చూస్తుంటే జాలేస్తుందన్నారు. పవన్ తల్లి, భార్యను తిట్టింది టిడిపి నేతలు కాదా? అని రోజా ప్రశ్నించారు. ఎబిఎన్ రాధాకృష్ణకు సిగ్గులేకుండా ఎలా ఇంటర్వూ ఇచ్చావని చురకలంటించారు. మిస్సింగ్‌కు అక్రమ రవాణాకు తేడా పవన్‌కు తెలుసా? అని అడిగారు. చంద్రబాబు నాయుడు పాలనలో కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై పవన్ ఎందుకు మాట్లాడలేదని రోజా దుయ్యబట్టారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి పాలన ఓర్వలేక పవన్ తప్పుడు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వాలంటీర్ల వ్యవస్థను ఇతర రాష్ట్రాలు, దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని, అలాంటి వ్యవస్థను కించపరిచేలా మాట్లాడ్డం దారుణమని మండిపడ్డారు.

Also Read: నేపాల్‌లో కూలిన హెలికాప్టర్: ఐదు మృతదేహాలు లభ్యం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News