Thursday, January 23, 2025

‘ఉస్తాద్’ మూవీ నుంచి ‘రోజూ నడిచిన చోటే..’ లిరికల్ సాంగ్ రిలీజ్

- Advertisement -
- Advertisement -

టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి కొత్త జానర్లలో సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు మళ్లీ మరో కొత్త కథతో రెడీ అవుతున్నారు. ఆ చిత్ర‌మే ‘ఉస్తాద్’. శ్రీసింహా కోడూరి జతగా కావ్యా క‌ళ్యాణ్ రామ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యార్స్‌పై ఫ‌ణిదీప్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌ల‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ మంగ‌ళ‌వారం ల‌వ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ లిరిక‌ల్ సాంగ్‌కు ముందు హీరో శ్రీసింహా హీరోయిన్ కావ్యా క‌ళ్యాణ్ రామ్‌తో జ‌రిపే సంభాష‌ణ ఎంతో చ‌క్క‌గా ఉంది.

ఒక‌ప్పుడు ఉత్త‌రాల‌ను తీసుకెళ్ల‌టానికి పావురాల‌ను ఉప‌యోగించేవారంట‌. కానీ ఇలా బండ్ల‌ను కూడా ఉప‌యోగిస్తార‌ని నాకు తెలియ‌దు. అస‌లు ఎంతో గొప్ప‌గా ఎక్స్‌ప్రెస్ చేశావంటూ హీరో హీరోయిన్ మ‌ధ్య సాగే సంభాష‌ణ ఆక‌ట్టుకుంటోంది. అక్క‌డి నుంచి ‘రోజూ నడిచిన చోటే.. ’ అంటూ వచ్చే సాంగ్ హీరో హీరోయిన్ల మధ్య ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. అకీవా.బి సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలోని ‘రోజూ నడిచిన చోటే..’ సాంగ్‌ను అనంత శ్రీరామ్ పాడ‌గా అనురాగ్ కుల‌క‌ర్ణి పాడారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు మాట్లాడుతూ ‘‘ఉస్తాద్ టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. డిఫ‌రెంట్ సినిమాల‌ను కోరుకునే ఆడియెన్స్‌కు త‌ప్ప‌కుండా ఉస్తాద్ సినిమా న‌చ్చుతుంది. శ్రీసింహ, కావ్యా క‌ళ్యాణ రామ్ పెయిర్ ఆక‌ట్టుకుంటోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌టానికి సిద్ధం చేస్తున్నాం’’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News