Sunday, December 22, 2024

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి: రోల్ రైడా

- Advertisement -
- Advertisement -

Roll Rida who planted plants

 

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన పార్క్‌లో తెలుగు ర్యాపర్ రోల్ రైడా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రోల్ రైడా మాట్లాడుతూ పర్యావరఱణ పరిరక్షణకు తన వంతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగమై మొక్కలు నాటినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కార్యక్రమం అవసరం ఎంతగానో ఉందని అన్నారు. యువత ఇలాంటి కార్యాక్రమాల్లో పాల్గొనడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించిన వారవుతారని అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, కార్తికేయ ముగ్గిరికి రోల్ రైడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News