హైదరాబాద్: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మాణంలో ఆకాష్ పూరి హీరోగా రూపొందుతున్న ‘రొమాంటిక్’ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అనుకున్న దానికంటే ఓ వారం ముందుగానే సినిమాను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 29న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని ఫిల్మ్‌మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో హీరోహీరోయిన్లు ఆకాష్ పూరి, కేతిక శర్మ రొమాంటిక్‌గా దర్శనమిచ్చారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ నిర్మించడమే కాకుండా.. కథను, మాటలు, స్క్రీన్ ప్లేను అందించారు. పూరి జగన్నాథ్ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Romantic Movie to Release on Oct 29th