Monday, December 23, 2024

ప్రేమించడంలేదని యువతిపై పెట్రోల్ పోసి… పోలీస్ స్టేషన్‌లో నవ్వుతూ…

- Advertisement -
- Advertisement -

తన ప్రేమను నిరాకరించిందని యువతిపై పెట్రోలు పోసి నిప్పు పెట్టిన యువకుడు

Romantic person killed his Girl

రాంచీ : ప్రేమను నిరాకరించిందన్న కారణంతో నిద్రిస్తున్న యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించి దారుణం గా హతమార్చాడు ఓ యువకుడు. ప్ర స్తుతం పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడు చిరునవ్వులు చిందిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో ఈ ఘోరం జరిగింది. పోలీసుల కథ నం ప్రకారం.. దుమ్కాకు చెందిన 19 ఏళ్ల బాలిక 12వ తరగతి చదువుతోం ది. అదే ప్రాంతానికి చెందిన షారూక్ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అతడి ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతో గత మంగళవారం ఆమె నిద్రిస్తున్న సమయంలో కిటికీ బయట నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 90 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆమె అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. విషయం వెలుగులోకి రావడంతో దుమ్కాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఆమెకు న్యాయం చేయాలని వివిధ సంఘాలు ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు దుమ్కాలో 144 సెక్షన్ విధించారు. మరోవైపు బాలిక కుటుంబానికి సిఎం సోరెన్ రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

చట్టాలు కఠినంగా మార్చుకోవాలి : కెటిఆర్

జార్ఖండ్‌లోని దుమ్కాలో ఓ 12 ఏండ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. బాలికను హత్య చేసిన అత్యంత క్రూరమైన క్రిమినల్ షారూఖ్‌కు ఈ సమాజంలో చొటు లేద న్నారు. ఆ క్రిమినల్ మొహంలో ఎలాంటి పశ్చాత్తాప జాడలు కనిపించడం లేదన్నారు. ఈ సందర్భంగా ఐపిసి, క్రిమినల్ ప్రోసిజర్ కోడ్, జువైనల్ చట్టాల పనితీరు మెరుగుపర్చుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. వాటిని పూర్తిగా సమూలంగా మార్చి ఇలాంటి నిందితులను కఠిన శిక్ష పడేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. నిందితులు బయటకు రాకుండా చూడాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బలమైన చట్టాలు అవసరమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News