Friday, January 3, 2025

‘గేమ్ చేంజర్’ నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ అంచనాల నడుమ 2025లో విడుదలవుతున్న పాన్ ఇండియా మూవీ ఇది. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదలవుతుంది. విడుదల తేది దగ్గరవుతున్న కొద్ది రామ్ చరణ్, కియారా అద్వానీ జోడీ మధ్య కెమిస్ట్రీని స్టార్ డైరెక్టర్ శంకర్ ఎంత గొప్పగా తెరకెక్కించారోనని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ నిరీక్షణకు తెరపడింది. ఈ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదలైంది. తెలుగులో ‘నా నా హైరానా’.. హిందీలో ‘జానా హైరాన్ సా’.. తమిళంలో ‘లై రానా’ అంటూ మెలోడీ ఆఫ్ ది ఇయర్‌గా ఈ పాట ప్రేక్షకులను సమ్మోహనపరుస్తోంది. ఈ పాటను తెలుగులో రామజోగయ్యశాస్త్రి రాయగా, తమిళంలో వివేక్, హిందీలో కౌశర్ మునీర్ రాశారు. ఇక రామ్‌చరణ్, కియారా అద్వానీ జోడీ పాటలోని స్వచ్చతను హావభావాల రూపంలో పలికించారు.

పాట విడుదల కాగానే ఆడియెన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రేమలో ఉన్న హీరో హీరోయిన్లు ఒకరిపై ఒకరికి మనసులోని ప్రేమ భావాలు పదాల రూపంలో అందంగా అమర్చినట్లు కుదిరాయి. ఇక మేకింగ్ విషయానికి వస్తే శంకర్ మరోసారి పాటలను చిత్రీకరించటంలో తనకు తానే సాటి అని నా నా హైరానా పాటతో నిరూపించుకున్నారు. న్యూజిలాండ్‌లో ఈ పాటను ఇండియాలోనే ఇప్పటి వరకు ఎవరూ చిత్రీకరించని విధంగా రెడ్ ఇన్‌ఫ్రా కెమెరాతో చిత్రీకరించారు. ఒక్కో సన్నివేశం ఒక్కో పెయింటింగ్‌గా విజువల్ బ్యూటీతో పాట మనసుని తేలిక పరుస్తోంది. మళ్లీ మళ్లీ చూడాలనుకునేంత గొప్పగా పాటలోని ప్రతీ ఫ్రేమ్ ఉంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాటను ఫ్యూజన్ మెలోడీ (వెస్ట్రన్, కర్ణాటిక్ కాంబో)గా ట్యూన్ చేశారు. గేమ్ చేంజర్ సినిమాలోని ఈ పాటను శ్రేయా ఘోషల్, కార్తీక్ పాడారు. బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీని అందించారు. ఈ పాటను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించిన పోస్టర్ ప్రేక్షకుల్లో పాటపై అంచనాలను ఎంతగానో పెంచింది.

ఇప్పుడు పాట విడుదలయ్యాక పాట వారి అంచనాలను మించి ఉందని అందరూ భావిస్తున్నారు. ఇప్పటి వరకు ‘గేమ్ చేంజర్’ సినిమా నుంచి విడుదలైన ‘జరగండి జరగండి’… ‘రా మచ్చా రా.. ’ పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన మూడో సాంగ్ ‘నా నా హైరానా’ ఈ అంచనాలను నెక్స్ రేంజ్‌కు తీసుకెళ్లింది. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్‌లపై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. ‘గేమ్ చేంజర్’ సినిమాను తమిళంలో ఎస్వీసీ, ఆదిత్య రామ్ మూవీస్ విడుదల చేస్తుండగా హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనీల్ తడానీ విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 21న యు.ఎస్‌లోని డల్లాస్‌లో ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News