Thursday, January 23, 2025

అనుకున్న దానికంటే అద్భుతంగా…

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, రెనసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ సినిమాలోని మూడో పాట విడుదలైంది. దీనికి అనూహ్య స్పందన వస్తోంది. విజయవాడ కెఎల్ యూనివర్సిటీలో ఈ పాటను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ కార్యక్రమానికి దర్శకుడు కిరణ్ కొర్రపాటి, నిర్మాత అల్లు బాబీ, సంగీత దర్శకుడు తమన్‌తో పాటు మిగిలిన చిత్ర యూనిట్ హాజరయ్యారు. అక్కడ కాలేజీ అమ్మాయిల చేతుల మీదుగా విడుదలైన ఈ పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. లెజెండరీ దర్శకుడు శంకర్ కూతురు అతిథి శంకర్ ఈ పాట పాడారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తోంది. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అల్లు బాబీ మాట్లాడుతూ “గని సినిమా అనుకున్న దాని కంటే అద్భుతంగా వచ్చింది. తమన్ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతం అందించాడు. ఈ సినిమా ఈనెల 25న విడుదల కానుంది. త్వరలోనే ప్రీ రిలీజ్ వేడుక ఉంటుంది”అని తెలిపారు.

Romeo Juliet Song out from Ghani

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News