హైదరాబాద్: జిహెచ్‌ఎంసి కొత్త కమిషనర్ రోనాల్డ్ రోస్‌కు మరో 6 నెలల లోపు రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఓటాస్క్‌గా మారనున్నాయి. ఆయనకు ఇప్పటికే జిహెచ్‌ఎంసిలో పని చేసిన అనుభవం ఉండడంతో పాలన పరంగా దూసుకుపోయే అవకాశమే ఎక్కువ.. కాని ఎన్నికల నిర్వహణ టాస్క్‌గా మారే అవకాశం ఉంది. రోనాల్డ్ రోస్ ఇప్పటికే మూడు జిల్లా కలెక్టర్‌గా పని చేయడంతో ఆయనకు జిల్లా రిటర్నింగ్ అధికారిగా పూర్తి అనుభవం ఉన్నప్పటికీ హైదరాబాద్ విషయంలో కొంత వేరుగా ఉంటుంది.
ఎందుకంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు జిల్లా కలెక్టర్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ఉంటే హైదరాబాద్ జిల్లాకు మాత్రం రిటర్నింగ్ అధికారి జిహెచ్‌ఎంసి కమిషనరే.హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కేంద్రం కావడంతో అన్ని పార్టీల కేంద్ర కార్యాలయాలు ఇక్కడే ఉండడంతో సహాజంగానే జిల్లా రిట్నరింగ్ అధికారిపై కొంత ఒత్తిడి ఉంటుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో కంటోన్మెంట్ కలుపుకుని 15 నియోజక వర్గాలు ఉండగా పాతబస్తీలో ఎంఐఎం ప్రభావం అధికంగా ఉంటుంది. దీంతో ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు ఒక్కరిపై ఒక్కరూ ఫిర్యాదులు చేసుకోవడం ఎప్పుడు జరిగేదే.. అయితే ఈ సారి జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజెపికి ఊహించని విజయం దక్కడంతో కొంత దూకుడు పెంచింది.
దీంతో ఎంఐఎం, బిజెపితోకి, అధికార పార్టీ బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు మధ్య పోటీ నేపథ్యంలో ఈ ఏడాది ఎన్నికల్లో అక్క్రమాలకు పాల్పడుతురంటూ ఫిర్యాదు పెరిగి అవకాశం ఉంది. అయితే వీటన్నింటిని అధిగమించి ప్రశాంతంగా పారదర్శకగా ఎన్నికలు నిర్వహించాల్సింది రిటర్నింగ్ అధికారిగా జిహెచ్‌ఎంసి కమిషనర్‌దే.. అంతేకాకుండా హైదరాబాద్‌లో గత రెండు మూడు ఎన్నికల నుంచి ఓటింగ్ శాత అంతకు అంతా తగ్గుతుండడతో ఓటర్లలో చైతన్యం నింపడం ద్వారా అధిక సంఖ్యలో వారిని పోలింగ్ బూత్‌లకు వచ్చే విధంగా చేయడం కూడా రిటర్నింగ్ అధికారిదేకీలక బాధ్యత కావడంతో ఆయన ఏవిధమైన చర్యలు తీసకుంటారోని సర్వత్రా అసక్తి నెలకొంది.