విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సదుపాయాలు కల్పించాలి
గురుకుల వసతులపై పూర్తి నివేధికను ఇవ్వండి
తెలంగాణ రాష్ట్ర గురుకుల కార్యదర్శి రోనాల్డ్ రోస్
మన తెలంగాణ/గట్టు : మండల కేంద్రంలో గట్టు మరియు మానవపాడు గురుకుల బాలికల పాఠశాలను తెలంగాణ రాష్ట్ర గురుకుల కార్యదర్శి రోనాల్డ్ రోస్ ఐఎఎస్, జిల్లా కలెక్టర్ శ్రీహర్షతో కలసి బుధవారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురుకుల పాఠశాలలో గట్టు గురుకులంలో 640, మానవపాడు గురుకులంలో 480 మంది విద్యార్థులు చదువుతుండగా, తరగతి గదులు, వంట గదులు, కంప్యూటర్ శిక్షణ తదితర వాటిని కళశాల ప్రిన్సిపల్‌లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐఎఎస్ అధికారి రోనాల్డ్ రోస్ మాట్లాడుతు.. ప్రభుత్వం ప్రకటించిన సెలవులు పూర్తెనందున విద్యార్థులు పాఠశాలకు హజరు అయ్యోల చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రం లోని 268 గురుకుల పాఠశాలు వసతుల కల్పన, విద్య, భోజన వసతి, విద్యార్థుల హజరు తదితర అంశాలను పరిగణలోకి తీసుకోనున్నామన్నారు.
పాఠశాలలో విద్యార్థుల వసతుల కల్పనపై ఇతర అంశాలపై పరిశీలించి వాటిని పరిష్కరించనున్నామని తెలిపారు. రెండు గంటలపాటు గురుకుల పాఠశాలను సందర్శించిన రోనాల్డ్ రోస్ గట్టు మండల సదుపాయాలు, సోలార్, తదితర సదుపాయాలను ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధనలక్ష్మి, ఎంపిటీసి యస్ కృష్ణ, ఉమ్మడి జిల్లా గురుకుల ఆర్‌సివో లారేన్స్ రాణి, గట్టు గురుకుల ప్రిన్సిపల్ సిహెచ్ వాణి, మానవపాడు గురుకుల ప్రిన్సిపల్ కేజా,గురుకుల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.