- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపాదించనున్న కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు. రోనాల్డ్ రాస్ వెంట జిల్లా కలెక్టర్ అనుదీప్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ ఝా, అడిషనల్ కమిషర్ విక్రమ్ సింగ్ మాన్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ తదితరులు ఉన్నారు. బహద్దూర్ పూర్, మలక్ పేట్ ,అంబర్ పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, సనత్ నగర్, సికింద్రాబాద్ నియోజక వర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుకు పలు ప్రాంతాల్లో ఉన్న ఏడ్యుకేషన్ క్రీడా ప్రాంగణ భవనాలను పరిశీలించారు.
- Advertisement -