Sunday, December 22, 2024

రైల్వే స్టేషన్ పైకప్పు కూలి.. 14 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఉత్తర సెర్బియాలో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్ పైకప్పు కుప్పకూలిపోవడంతో 14 మంది మృతి చెందారు. శుక్రవారం నోవి సాడ్ రైల్వే స్టేషన్ కాంక్రీట్ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఒక చిన్నారి, ఓ విదేశీయుడు సహా కనీసం 14 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘటనలో చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారని.. వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ శ్రమిస్తున్నారని అధికారులు చెప్పారు. బయటకు తీసుకొచ్చిన పలువు క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనాస్థలంలో 80 మంది రెస్క్యూ వర్కర్లు శిథిలాలను తొలగిస్తున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మంత్రి ఐవికా డాసిక్ వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News