Monday, January 20, 2025

జో రూట్ అరుదైన ఘనత

- Advertisement -
- Advertisement -

ముల్తాన్: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐసిసి ఆల్ టైమ్ ఐసిసి టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రూట్ టాప్20లోకి దూసుకొచ్చాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో రూట్ అద్భుత డబుల్ సెంచరీని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రూట్ టెస్టు క్రికెట్‌లో మరో ఫీట్ ను అందుకున్నాడు. ఆల్ టైమ్ ఐసిసి టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్20లో చోటు సంపాదించాడు. భారీ డబుల్ సెంచరీ సాధించడంతో రూట్ ఐసిసి బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.

ప్రస్తుతం రూట్ 932 పాయింట్లతో ఆల్ టైమ్ జాబితాలో 17వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమం లో డాన్ బ్రాడ్‌మాన్, రికి పాంటింగ్, లెన్ హట్ట న్ వంటి దిగ్గజ క్రికెటర్ల సరసన రూట్ నిలిచా డు. మరోవైపు భారత స్టార్ బ్యాటర్ 937 రేటింగ్ పాయింట్లతో 12వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. కాగా, కొంతకాలంగా టెస్టు క్రికెట్‌లో జో రూట్ ఆకాశమే హద్దుగా చెలరేగి పో తున్నాడు. సిరీస్ ఏదైనా పరుగుల వరద పారించడం అలవాటుగా మార్చుకున్నాడు. తాజాగా పాక్‌తో జరిగిన తొలి టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీని బాదేశాడు. దీంతో అతని టాప్ ర్యాం క్ మరింత పటిష్టంగా తయారైంది. రెండో టెస్టులోనూ సత్తా చాటితే రూట్‌కు ఎదురే ఉండదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News