Monday, January 20, 2025

సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి: ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

వచ్చే ఎన్నికల్లో ఢంకా మోగించి…

అన్ని ఎంఎల్‌ఎ స్థానాలను గెలిపించి కెసిఆర్‌కి కానుకగా ఇవ్వాలి

సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకున్న ఘనత కెసిఆర్‌ది
సింగరేణి పాఠశాలల కాంట్రాక్ట్ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో ఎంఎల్‌సి కవిత సమావేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి ప్రాంతాల్లో ఉన్న అన్ని ఎంఎల్‌ఎ స్థానాలను గెలిపించి సిఎం కెసిఆర్‌కు కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి సంస్థకు చెందిన పాఠశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆదివారం నాడు హైదరాబాదులో కల్వకుంట్ల కవితను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ…. సింగరేణిని ప్రైవేటీకరించే పరిస్థితి నుంచి సిఎం కెసిఆర్ తప్పించారని తెలిపారు. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించి ఆ సంస్థను కాపాడారని చెప్పారు. ఆర్‌టిసి సంస్థను కూడా ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యలను రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారని అన్నారు.

తెలంగాణ రాకముందు వారసత్వ ఉద్యోగాల అంశం తీవ్రమైన సమస్యగా ఉండేదని, అప్పట్లో కేవలం 4 వేల ఉద్యోగాలు మాత్రమే ఇస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత 20 వేల ఉద్యోగాలు కల్పించాలని స్పష్టం చేశారు. కేవలం మానవతా దృక్పథంతో ఆలోచించి సిఎం కెసిఆర్ వారసత్వ ఉద్యోగాలను కల్పించారని చెప్పారు. అదేవిధంగా సింగరేణి సంస్థలోని పాఠశాలల టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని ఎంఎల్‌సి హామీ ఇచ్చారు. తాను కూడా చొరువ తీసుకొని ఈ విషయంపై సిఎం కెసిఆర్‌తో చర్చిస్తానని అన్నారు. అవసరమైతే సింగరేణి కార్మిక నాయకులతో సిఎంతో సమావేశం ఏర్పాటు చేయించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిబిజికెఎస్ జనరల్ సెక్రెటరీ మిరియాల రాజిరెడ్డి, ఇతర నాయకులు నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News