Sunday, January 19, 2025

గులాబి వనం….వరంగల్ నగరం..!

- Advertisement -
- Advertisement -

వరంగల్ : రాష్ట్ర మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈనెల 17న వరంగల్ పర్యటనకు రానున్నారు. వరంగల్ పర్యటనలో ప్రధానంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. చారిత్రక వరంగల్ నగరంలో ఆశించిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే అని చెప్పక తప్పదు. ఇక్కడి నుండి ఎంఎల్‌ఏగా ప్రాతినిధ్యం వహిస్తున్న నన్నపనేని నరేందర్ రాజకీయాల్లో వార్డు స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగిన వారు.

అన్ని వర్గాల ప్రజలతో మమేకమై మాస్ లీడర్‌గా గుర్తింపును తెచ్చుకొని భౌగోళిక పరిస్థితులను ఆకలింపు చేసుకొని ఎంఎల్‌ఏగా ప్రజా సమస్యల్ని ముఖ్యమంత్రి కెసిఆర్, మున్సిపల్ ఐటిశాఖ మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకెళ్ళి ఏళ్ల తరబడి అపరిష్కృతమైన డ్రైయినేజి, ఇంటర్నెట్ రోడ్లు వంటి సమస్యలకు మోక్షం కల్పించారు. శనివారం మంత్రి కెటిఆర్ పర్యటన నేపథ్యంలో ఎంఎల్‌ఏ నన్నపనేని నేతృత్వంలో వరంగల్ నగరంలో పెద్దయెత్తున స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగరంలో కనివినీ ఎరగని రీతిలో గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను, భవిష్యత్తులో చేపట్టబోయే పనులను ప్రజల్లో విస్రృతంగా ప్రచారం కల్పించేందుకు కెటిఆర్ పర్యటనను ఎంఎల్‌ఏ వేదికగా చేసుకుంటున్నారు. అందులో భాగంగానే నగరంపై నన్నపనేని తన అభివృద్ధి మార్క్‌ను చాటుకునేందుకు భారీగా స్వాగత తోరణాలు, కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఏటు చూసినా గులాబిమయమే కనిపిస్తుంది.
కెటిఆర్ పర్యటన షెడ్యూల్ ఇదే.17వ తేదీన ఉదయం 9.30గంటలకు వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం పరిధి గీసుకొండ మండలం శాయంపేట గ్రామంలోని మోగా టెక్స్‌టైల్ పార్క్‌లో యంగ్ వన్ కంపెనీ పనులకు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఉదయం 11.30 గంటలకు ఓసిటిలో నిర్మించిన వరంగల్ తూర్పు ఎంఎల్‌ఏ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అక్కడే మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం అజంజాహి మిల్లు గ్రౌండ్‌లో నిర్మించ తలపెట్టిన వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనానికి భూమి పూజ చేస్తారు.

మధ్యాహ్నం 2గంటలకు దేశాయిపేటలోని జర్నలిస్టుల డబుల్‌బెడ్రూం గృహాలను ప్రారంభిస్తారు. 2.30కు అక్కడే జిల్లా వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌ను ప్రారంభిస్తారు. అక్కడి నుండి 2.50 గంటలకు కొత్తవాడ జంక్షన్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ, చేనేతన్న విగ్రహాలను ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 3.15గంటలకు మండిబజార్‌లో ఈద్గా, దర్గా, మసీదు పనులకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత మధ్యాహ్నం 3.40గంటలకు వరంగల్ చౌరస్తాలో స్మార్ట్ రోడ్లను ప్రారంభిస్తారు. సాయంత్రం 4గంటలకు వరంగల్ మోడ్రన్ బస్‌స్టేషన్ పనులకు, 4.30గంటలకు వరంగల్ వరంగల్ ఆర్‌డిఓ కార్యాలయం జంక్షన్‌లో ఇన్నర్‌రింగ్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. తదుపరి సాయంత్రం 4.50గంటలకు ఉర్సులో ఎస్‌టిపిని ప్రారంభిస్తారు.

సాయంత్రం 5గంటలకు ఉర్పు రంగలీలా మైదానం వద్ద చెరువు బండ్‌ను ప్రారంభిస్తారు. కుడా ఆధ్వర్యంలో నిర్మాణం జరిగే కల్చరల్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు. అక్కడే నీటి సరఫరా అభివృద్ధి, పట్టణ ప్రగతి అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 5.30గంటలకు ఉర్సు దర్గాను సందర్శించి కుడా చేపట్టే అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. 6గంటలకు ఖిలా వరంగల్‌ను సందర్శించి అక్కడ ఫకాడ్ లైటింగ్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం 6.30గంటలకు ఓ సిటీలో జరిగే పార్టీ బహిరంగసభలో పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News