Thursday, January 23, 2025

డిఫరెంట్ లుక్‌లో రోషన్

- Advertisement -
- Advertisement -

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ నెం 9 కొత్త చిత్రాన్ని ప్రకటించారు. రోషన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ఓ ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్టర్ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచింది. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ప్రదీప్ అద్వైతం మంచి స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో రోషన్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News