Monday, December 23, 2024

“బబుల్‌గమ్” ఫస్ట్ లుక్‌

- Advertisement -
- Advertisement -

ప్రైడ్ అఫ్ ఇండియన్ సినిమా ,డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “బబుల్‌గమ్” ఫస్ట్‌ లుక్‌ ను ఈరోజు లాంచ్ చేశారు. ‘నటుడిగా అరంగేట్రం చేసినందుకు రోషన్‌కు అభినందనలు. రోషన్ తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేయాలి. రాజీవ్, సుమ గారు గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నాను.  అలాగే,  బబుల్‌గమ్ టీమ్‌కి శుభాకాంక్షలు! ‘ అని ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు రాజమౌళి. ఈ ఎక్సయిటింగ్ జెన్జీ లవ్ స్టోరీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది, ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అవుతుందని హామీ ఇచ్చింది.

“బబుల్‌గమ్” ఇద్దరు కొత్తవారిని వెండితెరకు పరిచయం చేస్తోంది.  రోషన్ కనకాల, మానస చౌదరి, ఫస్ట్ లుక్‌లో తళుక్కున మెరుస్తూ, తమ చార్మ్ తో వీక్షకులని కట్టిపడేసారు. రోషన్ కనకాల గిరజాల జుట్టు, లేత గడ్డంతో పోస్టర్‌లో అందంగా కనిపిస్తున్నాడు. ట్రెండీ ఎటైర్ లో యంగ్ చాప్ నోటిలో బబుల్‌గమ్‌తో కనిపించారు. ఈ రొమాంటిక్ స్టొరీ గ్లింప్స్ అక్టోబర్ 10 న విడుదల కానుంది, ఇది ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతుంది.

“క్షణం”, “కృష్ణ అండ్ హిజ్ లీల” చిత్రాలలో ఎక్సటార్డినరీ వర్క్ తో ఆకట్టుకున్న ప్రముఖ దర్శకుడు రవికాంత్ పేరెపు “బబుల్గమ్” కు దర్శకత్వం వహిస్తున్నాడు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ కంపోజర్ శ్రీచరణ్ పాకాల సంగీతం, సురేష్ రగుతు ఛాయాగ్రహణం , నిషాద్ యూసుఫ్ ఎడిటింగ్.
“బబుల్‌గమ్” తాజా కథాంశంతో, ఆకర్షణీయమైన విజువల్స్‌తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ జెన్జీ లవ్ స్టోరీ మరిన్ని అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News