Monday, December 23, 2024

ఆర్‌ఆర్ యాజమాని చెంపదెబ్బలు కొట్టాడు: రాస్ టేలర్

- Advertisement -
- Advertisement -

 Ross Taylor Allegations on Rajasthan Royals Owner

ఐపీఎల్ 201సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ యజమాని తనను చెంపదెబ్బలు కొట్టాడని రాస్‌టేలర్ తన ఆత్మకథలో తెలిపాడు. టేలర్‌ను ఆర్‌ఆర్ యాజమాన్యం రూ.4.6కోట్లకు కొనుగోలు చేసింది. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టేలర్ డకౌట్ అయ్యాడు. మొహాలీ వేదికగా రాజస్థాన్, పంజాబ్‌జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం హోటల్‌లో ఆర్‌ఆర్ యజమాని ఒకరు దగ్గరకువచ్చి డకౌట్ అయ్యేందుకు తనను కొనుగోలు చేయలేదని చెంపపై నాలుగుసార్లు తట్టాడు. ఏ ఉద్దేశంతో అతడు అలా చేశాడు అర్థంకాలేదు. ఆ సంఘటన తర్వాత రాజస్థాన్ జట్టుకంటే బెంగళూరు జట్టును తనను కొనుగోలు చేసుంటే బాగుండేదనిపించిదని టేలర్ ఆత్మకథలో పేర్కొన్నాడు.

 Ross Taylor Allegations on Rajasthan Royals Owner

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News