న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ రాస్ టెలర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి వన్డే.. రాస్ కెరీర్‌లో ఆఖరి ఇంటర్నేషనల్ మ్యాచ్‌గా మారింది. ఈ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని రాస్ నిర్ణయించాడు. సుదీర్ఘ కెరీర్‌లో రాస్ కివీస్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధిచాడు. కెరీర్‌లో 112 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రాస్ 7684 పరుగులు చేశాడు. ఇందులో 19 శతకాలు, 3 డబుల్ సెంచరీలు మరో 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక టెస్టుల్లో రాస్ అత్యధిక స్కోరు 290 పరుగులు. మరోవైపు 236 వన్డేల్లో కివీస్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ క్రమంలో 8,602 పరుగులు సాధించాడు. వన్డేల్లో 21 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. దీంతో పాటు కెరీర్‌లో 102 అంతర్జాతీయ టి20లు కూడా ఆడాడు. ఈ ఫార్మాట్‌లో 1909 పరుగులు సాధించాడు. ఐపిఎల్‌లో కూడా రాస్ టెలర్ 55 మ్యాచ్‌లు ఆడాడు.
Ross Taylor Retires from all formats