Monday, January 20, 2025

టీచర్ పోస్టుల రోస్టర్ కసరత్తు

- Advertisement -
- Advertisement -

జిల్లాలవారీగా రోస్టర్ పాయింట్లు రూపొందిస్తున్న విద్యాశాఖ
ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే నోటిఫికేషన్
సెప్టెంబర్‌లో జారీకి అవకాశం
టెట్ ఫలితాల తర్వాతే దరఖాస్తుల ప్రక్రియ

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మరోసారి డిఎస్‌సి నోటిఫికేష న్ రానుండడంతో టీచర్ అభ్యర్థులు అప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించారు. రాష్ట్రంలో డిఎస్‌సి ద్వారా 5,089 ఉపాధ్యాయుల పోస్టులు, 1,523 స్పెష ల్ ఎడ్యుకేషన్ టీచర అవసరాల పిల్లల కు బోధించే ఉపాధ్యాయులు) భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. టీచర్ పో స్టులలో 2,575 సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జిటి), 1,739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితు లు, 164 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పిఇటి) పోస్టులు ఉన్నాయి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లు రూపొందించడంపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. రోస్టర్ పాయింట్లు పూర్తయిన వెంటనే డిఎస్‌సి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. టీచర్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 15వ తేదీన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) జరుగనుంది. అదే నెల 27వ తేదీన టెట్ ఫలితాలు వెల్లడించనున్నారు. డిఎస్‌సి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా టెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి కాబట్టి ఒకవేళ ముందుగా డి ఎస్‌సి నోటిఫికేషన్ వెలువడినా టెట్ ఫలితాల తర్వాతనే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిసింది.
ఆరేళ్లుగా నిరీక్షణ
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత 2017లో 8,972 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్టు (టిఆర్‌టి) నిర్వహించింది. వివిధ కారణాల వల్ల ఆ తర్వాత నియామకాలు లేకపోవటంతో ఆరేళ్లుగా ఉపాధ్యాయ కొలువుల కోసం టీచర్ అభ్యర్థులు ఎదురుచూస్తు న్నారు. 2017 అక్టోబరు 11న కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా కేడర్ పోస్టుల భర్తీలో 95 శాతం స్థానికులకే కేటాయించటంతో నాన్ లోకల్ కోటా భారీగా తగ్గింది. దీంతో స్థానికులకే ఎక్కువ ఉపాధ్యాయ కొలువులు వస్తాయనే నిరుద్యోగులు ఆశతో ఉన్నారు. ప్రతి ఏటా బి.ఎడ్, డి.ఎడ్ చేసిన అభ్యర్థులు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. డిఎస్‌సి రాయాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇటీవల టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించింది. సెప్టెంబరు 15న పరీక్ష నిర్వహించనున్నారు. 27న ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇందులో ఉత్తీర్ణులైన వారితో కలుపుకుంటే ఈసారి డిఎస్‌సి రాసే అభ్యర్థుల సంఖ్య మరింత పెరగనుంది. ప్రస్తుతం టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.5 లక్షల మంది ఉండగా, కొత్తగా టెట్ రాసే అభ్యర్థులతో కలిపి 4లక్షల వరకు డిఎస్‌సి రాసే అవకాశం ఉంది.
పాత పద్దతిలో పరీక్ష
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఈసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) ద్వారా కాకుండా గతంలో మాదిరిగా జిల్లా ఎంపిక కమిటీలు (డిఎస్‌సి) నియామకాలు చేపడతాయని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ ప్రకారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు డిఎస్‌సికి అర్హులు. డిఎస్‌సిలో అభ్యర్థులు సాధించిన మార్కులకు 80 శాతం, టెట్ లో వచ్చిన మార్కులకు 20 శాతం వెయిటేజి ఇచ్చి జిల్లాల వారీగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. అనంతరం ఆయా జిల్లాల డిఎస్‌సిలు నియామకాలు చేపడతాయి.
సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను సెప్టెంబరు 15వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుం చి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్- 1 పరీక్ష నిర్వహించనుండగా, మధ్యాహ్నం 1.30 నుంచి సాయం త్రం 5 గంటల వరకు పేపర్ -2 పరీక్షను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను వచ్చే నెల 9 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News