Friday, December 20, 2024

పక్కా యూత్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్ వంటి యూత్‌ఫుల్ చిత్రాలను నిర్మించిన లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్… సృజన్ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన తాజా చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టైటిల్ లోగోను స్టార్ ప్రొడ్యూసర్ నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఈ చిత్ర కథ నేను విన్నాను. ఇలాంటి టైటిల్ తో నేను ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను తీద్ధామని అనుకున్నాను. అయితే తమ సినిమాకు ఈ టైటిల్ సరిపోతుందని అడిగితే ఈ టైటిల్ ఇచ్చేశాను. కొత్త నటీనటులతో, సాంకేతిక నిపుణులతో, ట్రెండీ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం కంటెంట్ కొత్తగా వుంటుందని అనుకుంటున్నాను. కొత్త కంటెంట్ ఇస్తే మన ఆడియన్స్ సినిమాను తప్పకుండా ఆదరిస్తారు. ఈ చిత్రం కూడా అదే కోవలో చేరాలని ఆశిస్తున్నాను” అని అన్నారు.

నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. “ఇప్పటి వరకు మా సంస్థలో చాలా యూత్ ఫుల్ సినిమాలు చేశాను. ఆడియన్స్ కూడా ఆ చిత్రాలను బాగా ఆదరించారు. మళ్లీ అలాంటి యూత్ ఫుల్ సినిమా చేయాలనే ఆలోచనతో ఈ సినిమాను నిర్మించాను. పక్కా యూత్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. ఇందులో అన్ని ఎమోషన్స్ వుంటాయి”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News