Thursday, January 23, 2025

సబ్ కలెక్టర్‌ను చంపేసి చెరువులో పడేశారా?

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: రూర్కెలా సబ్ కలెక్టర్ మృతదేహం అనుమానాస్పదంగా చెరువులో కనిపించిన సంఘటన ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రూర్కెలాలో సుస్మితా మింజ్ అనే మహిళ సబ్ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. రజగంగాపూర్‌లోని రామబహల్ ప్రాంతంలో నివాసం ఉంటుంది. రూర్కెలాలోని రాధికా రెజెన్సీ హోటల్‌లో ఉన్నానని విశ్రాంతి తీసుకుంటానని ఫోన్ చేయవద్దని తనకు ఇబ్బంది కలిగించవద్దని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. మంగళవారం ఉదయం ఆమె హోటల్ నుంచి బయలు దేరారు. అదే రోజు సాయంత్రం ఆర్‌ఎస్‌పి అడ్మినిష్టేసన్ భవనానికి సమీపంలోని చెరువులో ఆమె మృతదేహం కనిపించింది. సుస్మితా తల్లి సెల్విస్టిన్ తన కూతురు ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేశారని ఆరోపణలు చేసింది. గత కొన్ని రోజుల నుంచి ఉన్నతాధికారులు తన కూతురును మానసికంగా వేధిస్తున్నారని, పని విషయంలో కూడా ఒత్తిడి చేశారని పలుమార్లు చెప్పిందని గుర్తు చేశారు. సబ్ కలెక్టర్ ఆఫీస్‌లో వేధింపులతో తన కూతురు ఆత్మహత్య చేసుకొని ఉంటుందని, హత్య చేసి ఉంటారని ఆమె అనుమానాలు వ్యక్తం చేసింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: మహిళా కానిస్టేబుల్‌పై దాడి: నిందితుడి ఎన్‌కౌంటర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News