Saturday, November 23, 2024

పాఠశాలల్లో ఆర్ట్ వర్క్‌షాప్‌లను ప్రారంభించిన రూట్స్ 2 రూట్స్

- Advertisement -
- Advertisement -

కళలు , సంస్కృతి, వారసత్వాన్ని ప్రోత్సహించడానికి అంకితమైన ఢిల్లీకి చెందిన లాభాపేక్షలేని సంస్థ, రూట్స్2రూట్స్ (R2R), తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో ఆర్ట్ వర్క్‌షాప్‌లను నిర్వహించనుంది. సాంప్రదాయ STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) పాఠ్యాంశాల్లో కళలను చేర్చడం ద్వారా దానిని STEAM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్, గణితం) గా మార్చటం ద్వారా భారతదేశ నూతన విద్యా విధానం (ఎన్ఈపి) అమలుకు మద్దతుగా ఈ కార్యక్రమం రూపొందించబడింది,

ఈ వర్క్‌షాప్‌లలో కళాకారులు, ఆర్ట్ టీచర్‌లతో లైవ్ సెషన్‌లు ఉంటాయి, వారు ఒడిస్సీ, కథక్ కళారూపాలలో విద్యార్థులకు విద్యను అందించడానికి పాఠశాలలను సందర్శిస్తారు. ఇంటరాక్టివ్ సెషన్‌లు విద్యార్థులకు నిపుణుల నుండి నేరుగా నేర్చుకోవడానికి, ప్రత్యక్ష ప్రదర్శనలను చూడటానికి, ప్రశ్నోత్తరాల సెషన్‌లలో పాల్గొనడానికి ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తాయి.

వర్క్‌షాప్‌లు జూలై 26న ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో ఆగస్టు 9 వరకు కొనసాగుతాయి. ప్రఖ్యాత కథక్ డ్యాన్సర్ అఖిలేష్ పటేల్, ఆంధ్రప్రదేశ్‌లో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు, తెలంగాణలో ఒడిస్సీ డ్యాన్సర్, శోమృత మండల్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమం గురించి రూట్స్ 2 రూట్స్ వ్యవస్థాపకుడు రాకేష్ గుప్తా మాట్లాడుతూ, “విద్యార్థుల సమగ్ర వికాసానికి కళలను పాఠ్యాంశాల్లోకి చేర్చడం చాలా అవసరం. ఇది వారి సాంస్కృతిక అవగాహన మెరుగుపరచడం తో పాటుగా సృజనాత్మకతను పెంచుతుంది. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఆర్ట్ ఎడ్యుకేషన్ ను అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుంది” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News