Tuesday, November 5, 2024

అంగారక గ్రహంపై రోవర్ మొదటి టెస్ట్‌డ్రైవ్ సక్సెస్

- Advertisement -
- Advertisement -

Rover's first test drive success on Mars

 

లాస్‌ఏంజెల్స్ : నాసా రోవర్ పర్సెవరెన్స్ అంగారక గ్రహం మొదటి టెస్ట్‌డ్రైవ్‌ను విజయవంతంగా సాగించింది. టెస్ట్‌డ్రైవ్ అంటే గ్రహం ఉపరితలంపై కొంతదూరం ప్రయాణించడం. అరుణగ్రహంపై తన వైజ్ణానిక ఆపరేషన్ ప్రారంభానికి ముందు దాదాపు 6.5 మీటర్ల దూరం ప్రయాణించడం ప్రధాన మైలురాయిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆరు చక్రాలు కలిగిన పర్సెవరెన్స్ రోవర్ 33 నిమిషాల వ్యవధిలో 6.5 మీటర్లు (21.3 అడుగులు )దూరంలో సాగిన ఈ ప్రయాణంలో 4 మీటర్లు ముందుకు సాగి 150 డిగ్రీలు ఎడమవైపునకు తిరిగి వెనక్కు మరో 2.5 మీటర్లు ప్రయాణించిందని నాసా ప్రకటనలో పేర్కొంది. ఇతర గ్రహాలపై చక్రాల వాహనాల విషయానికి వస్తే ఫస్ట్‌డ్రైవ్‌కు సంబంధించి ప్రాముఖ్యతను తెలియచేసే కొన్ని మొదటిసారి సంఘటనలు ఉన్నాయని పర్సెవరెన్స్ మొబిలిటీ టెస్ట్‌బెడ్ ఇంజినీర్ అనైస్ జరిఫ్యాన్ వెల్లడించారు.

ఈ డ్రైవ్ సిస్టమ్‌తో తమకు నమ్మకం కుదిరిందని, వచ్చే రెండేళ్లలో అంగారక గ్రహంపై ఎక్కడ ఏం ప్రయోగాలు చేయాలనుకున్నా చేయగలమని చెప్పారు. రోవర్ పరిశోధన ప్రారంభిస్తే ప్రతిరోజూ 200 మీటర్లు పైగా ప్రయాణించ గలదని భావిస్తున్నట్టు నాసా వెల్లడించింది. ఈ మిషన్‌లో రోవర్ అంగారక గ్రహం భౌగోళిక తత్వాన్ని, గత వాతావరణాన్ని పరిశోధిస్తుంది. దీనివల్ల అంగారక యాత్ర మానవులకు సాధ్యం కాడానికి మార్గం ఏర్పడుతుంది. అంగారక గ్రహంపై జీవం ఉనికిని అన్వేషించడానికి గత నెల 18 న రోవర్ గ్రహంపై కాలుమోపిన సంగతి తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News