Wednesday, November 13, 2024

కేరళలో చర్చి నడిపించే కాలేజ్ లో నమాజ్ కు గది కేటాయించమంటే…

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళలోని కేథలిక్ చర్చి నడిపించే కాలేజ్ లో ఒక గదిని నమాజ్ చేసుకోడానికి కేటాయించాలని కొందరు విద్యార్థులు డిమాండ్ చేశారు.  కానీ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఆ డిమాండ్ ను నిరాకరించింది. దాంతో వివాదం తలెత్తింది. కాగా ఈ విద్యార్థుల డిమాండ్ కు ‘ఉగ్రవాద అంశాలు’ కారణమని ఆదివారం బిజెపి ఆరోపించింది.

ముస్లిం సమాజానికి చెందిన విద్యార్థినుల బృందం మువట్టుపుళాలోని నిర్మలా కాలేజీలో ప్రార్థనలు చేయడానికి గదిని కేటాయించాలని అధికారులను కోరడంతో సమస్య శుక్రవారం ప్రారంభమైంది. డిమాండ్ నెరవేరకపోవడంతో, ఇతర విద్యార్థులు కూడా జోక్యం చేసుకున్నారు, వారు కళాశాల ప్రిన్సిపాల్, ఫాదర్ కన్నదన్ ఫ్రాన్సిస్‌ను ఘెరావ్ చేశారు. ఇదిలావుండగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షురాలు కె.అనుశ్రీ మాట్లాడుతూ క్యాంపస్‌లలో లౌకికవాదం కోసం తమ సంస్థ నిలుస్తుందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News