Saturday, November 23, 2024

‘రౌడీ బాయ్స్’ పూర్తిగా యూత్ సినిమా

- Advertisement -
- Advertisement -

Rowdy boys cinema released on sankranthi

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా శుక్రవారం విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు, హీరో ఆశిష్ మీడియాతో ముచ్చటించారు. హీరో ఆశిష్ మాట్లాడుతూ “చిన్నప్పటి నుంచి డాన్సులు చేసేవాడిని. అల్లు అర్జున్ నాకు ఇన్‌స్పిరేషన్. ఆయనలా నేర్చుకోవాలని అనుకున్నాను. కొన్ని కోర్సులు చేసి డ్యాన్సులో పర్ఫెక్ట్ అయ్యాను. ఇక సత్యానంద్ దగ్గర, భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాను. న్యూయార్క్‌లో ఫిలిం కోర్సులు చేశాను. కేరింత సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను.

‘రౌడీ బాయ్స్’ ఇంజనీరింగ్ వర్సెస్ మెడికల్ స్టూడెంట్స్ కథ అనగానే చాలా ఆసక్తిగా అనిపించింది. నా ఏజ్ గ్రూప్ క్యారెక్టర్ కథ కాబట్టి సులువుగా కథలోకి వెళ్లగలిగాను. దర్శకుడు హర్ష మేమూ కలిసి రోజుకు గంటల పాటు వర్క్ షాప్ చేసేవాళ్లం. ఈ చిత్రంలో మొత్తం 9 పాటలు ఉన్నాయి. దేవిశ్రీ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు”అని అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ “ఈ సినిమా పూర్తిగా యూత్‌ఫుల్ మూవీ. దర్శకుడు హర్ష చేసిన హుషారు సినిమా రిలీజ్ అయ్యాక అతన్ని కథ చెప్పమని అడిగాను. అతను తన లైఫ్‌లో జరిగిన స్టోరీ చెప్పాడు. అతని కాలేజ్ టైమ్‌లో జరిగిన కథ ఇది. ఆడియెన్స్ థియేటర్‌లో బోర్ కొట్టకుండా ఉంటుందని అనిపించింది. ఆశిష్ డాన్సులు, పర్ఫార్మెన్స్ చేయాలి… నవ్వించాలి, ఎమోషనల్ సీన్స్ చేయాలి అనుకున్నాను. సినిమా అలా చేస్తూ అతన్ని మలచుకుంటూ వచ్చాం. ఆశిష్‌కు మ్యూజికల్ ఈవెంట్‌లో చెప్పాను. నీతో ఒకటి, రెండు సినిమాలు నేను సపోర్ట్ చేస్తాను. ఆతర్వాత నువ్వే సినిమాలు వెతుక్కోవాలని చెప్పాను. అలా కెరీర్ ప్లాన్ చేసుకోవాలని చెప్పాను. ఆశిష్ అనేది రేపు ఒక బ్రాండ్ కావాలి. తనదైన ప్రత్యేకత లేకుంటే ప్రేక్షకులు గుర్తు పెట్టుకోరు. ఇక ‘రౌడీ బాయ్స్’ పూర్తిగా యూత్ సినిమా. ఇప్పటిదాకా నా సినిమాల్లో ముద్దు సీన్స్ ఉండవు. కానీ ఫస్ట్ టైమ్ ఈ చిత్రంలో కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. అందుకే ట్రైలర్‌లోనే ముద్దు సీన్ పెట్టాము. రేపు ఫ్యామిలీ ఆడియెన్స్ మా సినిమాకు వచ్చి ఇబ్బందిపడొద్దనే అలా ట్రైలర్‌లో కిస్ సీన్ పెట్టాం. కాలేజ్‌కు వెళ్లే స్టూడెంట్ ఎలా ఉంటాడో ఆశిష్ క్యారెక్టర్ అలా ఉంటుంది. రౌడీ బాయ్స్ సినిమా మ్యూజికల్ జర్నీగా ఉంటుంది. దేవిశ్రీ పాటలకు నేను ఫిదా అయ్యాను. సుకుమార్ రైటింగ్స్‌లో ఆశిష్ నెక్స్ ఫిల్మ్ ఉంటుంది. కాశీ దర్శకత్వంలో సెకండ్ ఫిల్మ్‌గా ‘సెల్ఫీష్’ ఉంటుంది. నేను, సుకుమార్ నిర్మాతలం”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News