Monday, December 23, 2024

‘ప్రేమదేశం’ చూసినట్లుగా ఉంది

- Advertisement -
- Advertisement -

Rowdy Boys movie trailer released

దిల్‌రాజు ప్రొడక్షన్స్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఈనెల 14న విడుదల చేస్తున్నారు. శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను స్టార్ హీరో ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ “రౌడీబాయ్స్ చిత్రం మంచి సినిమాగా మనకు గుర్తుండిపోవాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ చూస్తే ‘ప్రేమదేశం’ సినిమా చూసినట్లు అనిపించింది. నాకే కాదు ప్రేక్షకులందరికీ అలాగే అనిపిస్తుంది. హీరో ఆశిష్ మరిన్ని మంచి చిత్రాల్లో భాగం కావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను”అని అన్నారు. నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ “సంక్రాంతి సందర్భంగా ఈనెల 14న ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాము.ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది”అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News